Tuesday, April 16, 2024

కేక్ క‌ట్ చేసిన ఆర్ సీ15 చిత్ర టీం.. న్యూజిలాండ్ షెడ్యూల్ కంప్లీట్

త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్రం ఆర్ సీ15. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ బ‌డ్జెట్‌తో దిల్‌ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆర్‌సీ 15 మూవీకి కార్తీక్ సుబ్బరాజు క‌థ‌నందిస్తుండ‌గా..సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం న్యూజిలాండ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది ఆర్ సీ15 చిత్ర టీం. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టీం ట్విటర్‌ ద్వారా షేర్ చేసుకుంది.

లొకేషన్‌లో టీం మెంబర్స్ కేక్‌ కట్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో రాంచరణ్ హైదరాబాద్‌కు తిరిగిరానున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఆర్‌సీ 15 చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తుండగా.. అంజ‌లి, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, సునీల్, జ‌య‌రాయ్‌ ఇత‌ర కీ రోల్స్ పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement