Wednesday, April 17, 2024

పోలాండ్‌ గుహలో దొరికిన అతి పురాత‌న‌ ఆభరణం.. దాని విశేషాలు ఏంటో తెలుసా..

ప్ర‌భ‌న్యూస్ : ఏనుగు దంతంతో తయారు చేసిన అతిపురాతన ఆభరణం పోలాండ్‌లో బయల్పడింది. స్టాజ్నియా గుహలో ఈ ఆభరణం కనుగొనబడింది. యూరేషియాకు చెందిన అతిపురాతన ఐవరీ లాకెట్టుగా అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్ధారించింది. ఇది 41,500 సంవత్సరాల నాటిదని రేడియోకార్బన్‌ పరిశోధనలో తేలింది. స్టాజ్నియా గుహ ఒక సహజ నిర్మాణం. ఈ ప్రదేశంలో 2006 నుండి అధ్యయనం కొనసాగుతున్నది. ఇక్కడ జరిపిన త‌వ్వ‌కాలలో, నియాండర్తల్‌ అవశేషాల శ్రేణి-జంతువుల ఎముకలు, ఇతర కళాఖండాలు కనుగొనబడ్డాయి. ఇందుకు సంబంధించిన పరిశోధన వివరాలు గతవారం సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురించబడ్డాయి. 2010లో, దంతపు లాకెట్టు శకలాలు రెండు బయటపడ్డాయి. లాకెట్టు గుండ్రని అంచులతో ఓవల్‌ ఆకారాన్ని కలిగి ఉంది.

ఇది సీకెన్షియల్‌ పంక్చర్ల నమూనాలతో దానిపై రెండు డ్రిల్లింగ్‌ రంధ్రాలతో డిజైన్‌ కలిగివుంది. ”స్టాజ్నియా లాకెట్టు లూపింగ్‌ కర్వ్‌ చంద్రబింబాల గొలుసును పోలివుందా అనే సందేహాన్ని కలిగిస్తోంది. ఇలాంటి అలంకరణలు యూరప్‌ అంతటా కనిపించడం విశేషమని ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ సిస్టమాటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్‌ ఆఫ్‌ యానిమల్స్‌ పోలిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కి చెందిన సహ రచయిత ఆడమ్‌ నడచోవ్స్కీ అభిప్రాయపడ్డారు. ఈ ఐవరీ లాకెట్టులో అతిపెద్దభాగం 4.5 సెం.మీ పొడవు, 1.5 సెం.మీ వెడల్పు కలిగి ఉంది. లాకెట్టు ఏనుగు దంతం, గుర్రపు ఎముకతో తయారు చేయబడిందని బోలోగ్నా విశవిద్యాలయం మాస్‌ స్పెక్ట్రోమెట్రీ విశ్లేషించింది. ఈ ఆభరణం హూమో సేపియన్స్‌ సృజనాత్మకత, అసాధారణ నైపుణ్యాలను చూపుతుందని వ్రోక్లా విశవిద్యాలయానికి చెందిన సహ రచయిత వియోలెట్టా నొవాక్జెవ్స్కా పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement