Saturday, April 20, 2024

లాస్య‌కి మ‌ళ్లీ.. మ‌గ‌బిడ్డే

మ‌ళ్లీ పండంటి మ‌గ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చింది న‌టి..యాంక‌ర్ లాస్య‌.ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ‘ మా జీవితంలో కొత్త ప్రేమను కలుసుకున్నాం అంటూ ఓ క్యూట్​ వీడియో పోస్ట్​ చేసింది లాస్య. మార్చి 7న చిన్నారి జన్మించినట్లు తెలిపింది. ఈ వీడియోలో లాస్య, మంజునాథ్​తో పాటు వారి తొలి సంతానమైన దక్ష్​ చేతులు ఉన్నాయి. ఒక్కొక్కరు తమ చేతులు ఓపెన్​ చేస్తూ వస్తుంటే ‘ఇట్స్​ ఏ బేబీ బాయ్​’ అనే పదం కనిపిస్తోంది. ఈ విధంగా తమ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు లాస్య దంపతులు. తన యాంకరింగ్​ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలైన లాస్య.. బిగ్​బాస్​తో మరింత ఫేమస్​ అయ్యింది. మంజునాథ్​ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇదివరకే దక్ష్​ అనే కుమారుడు ఉన్నాడు. ఫ్యాన్స్​ కోసం సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ.. యూట్యూబ్​లో వీడియోలు కూడా చేస్తుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement