Monday, September 25, 2023

పార్టీ పథకాలపై ప్రజల్లో చెక్కుచెదరని అభిమానం.. మరో 15 రోజుల్లో సీఎం చేతికి పూర్తిస్థాయి సర్వే నివేదికలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలేదని స్పష్టం చేసినప్పటికీ ఎన్నికల వ్యూ#హరచనను మాత్రం టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ వేగవంతం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌(పీకే) టీమ్‌తో పాటు ఇతరులు చేసిన సర్వే రిపోర్టులు గులాబీ బాస్‌ టేబుల్‌పైకి ఇప్పుడిప్పుడే చేరుతున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. చేరుతున్నాయి. మొత్తం 103 మంది సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు జరిపిన సర్వేలో ఆశ్చర్యకర అంశాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. చాలా చోట్ల సిట్టింగ్‌లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైంది. ఏళ్లపాటు ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ప్రజాదరణ పొందలేని వారితో సీఎం కేసీఆర్‌ వన్‌ టు వన్‌ మాట్లాడనున్నారు. ఈసారి ఎవరెవరికి టికెట్లు దక్కే అవకాశం లేదో ఆ భేటీల్లోనే కుండబద్దలు కొట్టనున్నారు. ఏఐఎంఐఎంకు ఉన్న ఏడు స్థానాలు మినహా మొత్తం అసెంబ్లి నియోజకవర్గాల తుది సర్వే నివేదికలు ఈ నెల 15లోగా సీఎం చేతికి అందనున్నాయి. ఇప్పటికే 30 స్థానాల ప్రాథమిక నివేదిక తన చేతికి అందినట్లు ఇటీవల జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో స్వయంగా సీఎం కేసీఆర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

వ్యతిరేకత ఎక్కువగా ఉన్నవారికి సమయమిచ్చే యోచనలో పార్టీ…

- Advertisement -
   

పీకే, ఇతర టీమ్‌లు చేపట్టిన సర్వేల్లో పనితీరు పేలవంగా ఉన్నట్లు వెల్లడైన ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంతమందికీ టికెట్లు నిరాకరిస్తే ఏర్పడే పరిణామాలను అంచనా వేస్తూనే వారిలో కొందరికి పనితీరును మెరుగుపరచుకోవడానికి కేసీఆర్‌ ఆరు నెలల సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆరు నెలల తర్వాత తిరిగి సర్వే చేయిస్తామని, ఆలోగా పని తీరు, ప్రజాదరణ మెరుగుపర్చుకోలేని ఎమ్మెల్యేలకు 2023 ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వరాదని గులాబీ బాస్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చెంతకు చేరిన 30 నియోజకవర్గాల సర్వే రిపోర్టులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఓటర్లు సంతోషంగా ఉన్నారని, సీఎం కేసీఆర్‌ పట్ల ప్రజల్లో అభిమానం కూడా చెక్కుచెదరనట్లు చెబుతున్నారు. కానీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై మాత్రం ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు బదులు ఈసారి కొత్త ముఖాలను జనం కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ప్రధానంగా ఒకటి కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినవారిపై నియోజకవర్గాల్లో వ్యతిరేక ధోరణి సర్వేలో కనిపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లిdలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో 90 మంది ఎమ్మెల్యేలు ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచినవారే కావడం గమనార్హం. వీరిలో 80 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారే. 119 మంది ఎమ్మెల్యేలలో 44 మంది ఎమ్మెల్యేలు రెండు దఫాలుగా ఎన్నికైనవారు కాగా, 22 మంది ఎమ్మెల్యేలు మూడు సార్లు, 14 మంది ఎమ్మెల్యేలు 4సార్లు, 5గురు ఎమ్మెల్యేలు ఐదుసార్లు, నలుగురు ఎమ్మెల్యేలు ఆరుసార్లు గెలిచినవారున్నారు. అనేకసార్లు గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు టీఆర్‌ఎస్‌కు చెందినవారే కావడం గమనార్హం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఓటర్లలో సాప్ట్‌n కార్నర్‌ ఉన్నప్పటికీ, పలుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలపై ‘యాంటీ ఇన్‌కంబెన్సీ’ స్పష్టంగా వ్యక్తమవుతోందని పీకే, ఇతరుల సర్వేలు సూచించాయి. ఇతర పార్టీల నుంచి గెలిచి, టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లోనూ వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement