Saturday, March 25, 2023

జీవితంపై విర‌క్తి చెంది ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌

నిజామాబాద్ జిల్లాలో జీవితంపై విర‌క్తి చెందిన ప‌శుసంవ‌ర్ధ‌క శాఖలో ప‌నిచేస్తున్న ఉద్యోగి ఆత్మ‌హ‌త్యకు చేసుకున్నారు. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప‌నిచేస్తున్న శ్రీశైలం తన కార్యాలయంలోనే ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. నిజామాబాద్ లోని ఆనంద్ నగర్‌లో శ్రీశైలం కుటుంబం నివాసం ఉంటుండ‌గా.. అత‌డికి ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నారు. మృతుడి స్వస్థలం వరంగల్ జిల్లాగా గుర్తించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement