Friday, March 29, 2024

ఎంసెట్‌ దరఖాస్తు గడువు ముగింపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ఎంసెట్‌-2022 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 28తో గడువు ముగియగా, రూ.250 అపరాధ రుసుముతో జూన్‌ 7 వరకు ఉంది. అదేవిధంగా రూ.500తో జూన్‌ 17 వరకు, రూ.2500 లేట్‌ ఫీజుతో జూన్‌ 27, రూ.5000 లేట్‌ ఫీజుతో జూలై 7వ తేదీ వరకు చివరి గడువు ఉంది. జూన్‌ 25 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. శనివారం సాయంత్రం వరకు 2,49,708 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement