Wednesday, April 24, 2024

పంజాబ్ లో టెన్ష‌న్ ….టెన్ష‌న్ అమృత‌పాల్ సింగ్ అరెస్ట్

చండీగ‌డ్ – ఖలిస్తానీ లీడర్.. వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. జలంధర్ లోని నకోదర్ సమీపంలోని కారులో వ‌స్తున్న అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు మరో ఆరుగురిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ కోసం 50 వాహనాల్లో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారని.. రహస్య ప్రదేశానికి తరలించారనే వార్తలతో పంజాబ్ లో ఒక్క‌సారిగా ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అత‌డి అరెస్ట్ ను నిర‌సిస్తూ పంజాబ్ లోని ప్రత్యేక వేర్పాటు వాదులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కాగా, ఇంటర్నెట్ సేవలను కట్ చేసింది ప్రభుత్వం. ఎస్ఎంఎస్ సేవలను సైతం నిలిపివేసింది పంజాబ్ సర్కార్. అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయటానికి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం ఆయుధాలతో బెదిరిస్తూ.. పోలీస్ బారికేడ్లను ఢీకొట్టి.. అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి తన అనుచరులను బలవంతంగా తీసుకెళ్లారని,ఆ దాడిలో చాలా సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్, అతని అనుచరులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement