Sunday, June 4, 2023

8న ఏపీలో అమిత్‌ షా పర్యటన..

ఈనెల 8న ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. 8న ఉదయం 11:15 గంటలకు కర్నూలులో బహిరంగ సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 1:30 గంటకు పార్టీ కార్యకర్తలతో కేంద్ర మంత్రి సమావేశం అవుతారు. అలాగే సాయంత్రం 3 గంటలకు పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీ సత్యసాయిబాబా ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఆపై సాయంత్రం 5 గంటలకు పుట్టపర్తిలో పార్టీ కార్యకర్తలతో కేంద్రమంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement