Wednesday, October 4, 2023

అన్న‌కోసం మ‌రోసారి గెస్ట్ గా ఎన్టీఆర్

బింబిసార చిత్రానికి గెస్ట్ గా విచ్చేశారు స్టార్ హీరో ఎన్టీఆర్.. కాగా మ‌రోసారి త‌న అన్న చిత్రం అమిగోస్ కి గెస్ట్ గా రానున్నారు ఎన్టీఆర్. హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న తాజా చిత్రం అమిగోస్..ఈ చిత్రాన్ని రాజేంద్ర రెడ్డి తెర‌కెక్కిస్తున్ఆన‌డు.ఈ సినిమాలో హీరో కల్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైదరాబాద్‌ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిధిగా రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా విడుదల అయిన ఎన్నో రాత్రులొస్తాయి గాని సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement