Sunday, November 10, 2024

America Tour – మంత్రి లోకేష్ కు అభిమానుల తాకిడి!

ఆంధ్రప్రభ స్మార్ట్, అమరావతి:పెట్టుబడుల సాధన కోసం అమెరికా వెళ్లిన మంత్రి నారా లోకేష్‌కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో తీరికలేకుండా ఉంటూనే… మరోవైపు తమను కలిసేందుకు వచ్చిన అభిమానులను నిరాశపర్చకుండా ఫొటోలు దిగారు.

మంత్రి బసచేసిన ఫోర్ సీజన్స్ హోటల్ వద్దకు వచ్చిన సుమారు 200 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఫొటోలు దిగిన లోకేష్ వారిని ఆప్యాయంగా పలకరించి సాద‌కబాధకాలను తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement