Wednesday, November 6, 2024

America – డోనల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం

అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీపడుతున్నమాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినట్టు ఎఫ్‌బీఐ ప్రకటించింది.

ఈ ఘటన ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ఆదివారం రాత్రి ట్రంప్‌కు చెందిన అంతర్జాతీయ గోల్ఫ్‌క్లబ్‌లో జరిగింది.ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న సమయంలో ఆయనకు రక్షణగా ఉన్న

సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పొదల్లో గన్‌తో దాక్కున్న వ్యక్తిని గుర్తించారు. సహజంగా భద్రత చర్యలలో భాగంగా ట్రంప్ కంటే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కొంతముందు ఉంటారు. గోల్ఫ్ ఆడే సమయంలో ట్రంప్ ఒక హోల్ వద్ద ఉంటే, ఆయన తరువాత చేరుకునే హోల్ వద్దకు ఈ ఏజెంట్లు ముందుగానే వెళ్తారు.గోల్ఫ్ కోర్సులోని ఐదు, ఆరు, ఏడు హోల్స్ సమీపంలో ఉన్న పొదల్లో షూటర్ దాక్కున్నట్లు కౌంటీ షరీఫ్ రిక్ బ్రాడ్‌షా తెలిపారు.

- Advertisement -

గోల్ఫ్ కోర్సు వద్ద రైఫిల్, రెండు బ్యాక్‌పాక్‌లను స్వాధీనం చేసుకున్నారుపొదల్లోంచి బయటకువచ్చిన తుపాకీ బారెల్‌ను ఏజెంట్లు గుర్తించి వెంటనే కాల్పులు జరిపారు. ఆ సమయంలో ట్రంప్ ఘటనాస్థలానికి 300-500 గజాల దూరంలో ఉన్నారు.ఏజెంట్లు పలుమార్లు కాల్పులు జరిపాక అనుమానితుడు పొదల్లోంచి బయటకు వచ్చి పారిపోతూ నల్లని నిస్సాన్ కారులోకి దూకడాన్ని ఓ ప్రత్యక్ష సాక్షి గమనించారు.

అనుమానితుడి కారును, లైసెన్సు ప్లేట్‌ను ఆ సాక్షి ఫొటో తీశారు.తరువాత ఆ కారును గోల్ఫ్ క్లబ్‌కు ఉత్తరాన మార్టిన్ కౌంటీ వద్ద ఆపారు.’మేం వెంటనే మార్టిన్ కౌంటీ షరీఫ్ కార్యాలయాన్ని అప్రమత్తం చేశాం. దీంతో వారు ఆ వాహనాన్ని ఆపి, అనుమానితుడిని కారులోంచి బయటకు లాగి అదుపులోకి తీసుకున్నారు’ అని పామ్‌బీచ్ కౌంటీ షరీఫ్ రిక్ బ్రాడ్‌షా చెప్పారు.

.”మేం ప్రత్యక్షసాక్షిని తీసుకువచ్చాం. పొదల్లోంచి బయటకు వచ్చి కారులోకి దూకిన వ్యక్తిని ఆయన గుర్తించారు” అని షరీఫ్ మీడియాతో చెప్పారు.

తాను క్షేమంగా ఉన్నట్టు” ట్రంప్ తన మద్దతుదారులకు ఈమెయిల్ ద్వారా తెలిపారు.”నన్ను ఏదీ ఆపలేదు. నేను ఎప్పటికీ లొంగిపోను” అని ఆయన రాశారు.

.పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన రెండు నెలల తరువాత ఇప్పడీ ఘటన జరిగింది.ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు సీక్రెట్ సర్వీస్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement