Thursday, April 25, 2024

కొవాగ్జిన్‌కు అమెరికా షాక్

ఇండియాలో అభివృద్ధి చేసిన తొలి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్‌డీఏ) అనుమ‌తి నిరాక‌రించింది. అమెరికాలో అక్యుజెన్ అనే ఫార్మా కంపెనీ కొవాగ్జిన్ స‌ప్లై కోసం భార‌త్ బ‌యోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అత్య‌వ‌స‌ర వినియోగానికి నో చెప్ప‌డంతో ఇప్పుడు తాము పూర్తిస్థాయి అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటామ‌ని అక్యుజెన్ వెల్ల‌డించింది. యూఎస్ ఎఫ్‌డీఏ చెప్పిన ప్రకార‌మే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, దీనికోసం కూడా మ‌రింత డేటా వాళ్లు కోరార‌ని ఆ సంస్థ చెప్పింది.

అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి సాధించేలా క‌నిపించామ‌ని, అయితే ఎఫ్‌డీఏ మాత్రం బ‌యోలాజిక్స్ లైసెన్స్ అప్లికేష‌న్ పెట్టుకోవాల్సిందిగా సూచించింద‌ని అక్యుజెన్ తెలిపింది. ఈ ప్ర‌క్రియ‌కు స‌మ‌యం ప‌డుతుంద‌ని, అయితే కొవాగ్జిన్‌ను అమెరికాకు తీసుకురావ‌డానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని అక్యుజెన్ సీఈవో శంక‌ర్ ముసునూరి స్ప‌ష్టం చేశారు. ఈ ఏడాది మార్చిలో కొవాగ్జిన్‌కు సంబంధించిన పాక్షిక స‌మాచారాన్ని మాత్ర‌మే ఎఫ్‌డీఏకు అక్యుజెన్ స‌మ‌ర్పించింది. గ‌త నెల‌లోనే ఇక ఏ వ్యాక్సిన్‌కూ తాము అత్య‌వ‌స‌ర అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని ఎఫ్‌డీఏ తేల్చిచెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement