Thursday, December 5, 2024

Ameenpur – మోస పోయాం – బిల్డర్ లో నుంచి నష్టపరిహారం ఇప్పించండి – హైడ్రా కమిషనర్ కు బాధితులు మొర

హైదరాబాద్ – అమీన్ పూర్‎లో ప్లాట్లు కొని మోసపోయామంటూ హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ వద్దకు బాధితులు క్యూ కట్టారు. మాధవరెడ్డి, చంద్రశేఖర్‌, కోటీశ్వరరావు లో దగ్గర ప్లాట్లు కొని మోసపోయామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‎కు శుక్రవారం బాధితులు ఫిర్యాదు చేశారు.

సర్వే నంబరు 6 అనుమతులు చూపించి సర్వే నంబరు 12కు చెందిన ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా అమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసి అమ్మిన వ్యక్తి నుంచి నష్టపరిహారం ఇప్పించాలంటూ హైడ్రా కమిషనర్‌‎ను బాధితులు కోరారు.

- Advertisement -

రద్దయిన అనుమతుల విషయాన్ని బయటకు చెప్పకుండా తమను మోసం చేసి ప్లాట్లు అమ్మేసారంటూ బాధితులు ఆవేదనకు గురి అయ్యారు. దీంతో పూర్తి సర్వేచేయించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ భరోసా ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. అమీన్‌పురా మండలంలోని పెద్ద చెరువు అలుగులు మూసేసి.. ఎగువ వైపు తమ స్థలాల్లోకి చెరువు నీరు వచ్చేలాచేశారంటూ మరి కొంతమంది హైడ్రా కమిషనర్‎కి కంప్లైంట్ చేశారు. పెద్దచెరువు నీరు కింద ఉన్న బండికుంట చెరువుకు వెళ్లేలా కాకుండా.. అటువైపు అలుగులు మూసేయడంతో ఎగువవైపు నీరు పారుతుండడంతో తమ ఇళ్ల స్థలాలు కోల్పోయామంటూ బాధితులు ఫిర్యాదు చేశారు.

సర్వేనంబరు 153లోని హుడా అనుమతి పొందిన లే ఔట్లో ఉన్న పార్కు స్థలాన్ని పక్కనే కొత్తగా వెంచర్ వేస్తున్న వారు కబ్జా చేశారంటూ అమీన్‌పురా మండలంలోని వెంకటరమణా కాలనీ వాసులు కంప్లైంట్ చేశారు. సర్వే చేయించి తమ పార్కుతో పాటు.. లే ఔట్‌లోని రహదారులను కాపాడాలంటూ కమిషనర్ రంగనాథ్‎కు విన్నవించుకున్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేయించి.. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్న కమిషనర్ రంగనాథ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement