Wednesday, October 4, 2023

హిట్ 2 చిత్ర స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న‌.. అమెజాన్ ప్రైమ్ వీడియో

హిట్2 ఓటీటీ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది అమెజాన్ ప్రైమ్ వీడియో. హిట్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది హిట్ ది సెకండ్ కేస్. వసూళ్ల పరంగానూ బాగానే వర్కవుట్ అయ్యింది.ఈ చిత్రంలో హీరోగా అడ‌వి శేషు.. మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించారు.శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేయగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ బయిటకు వచ్చాయి.

- Advertisement -
   

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ డిజిటల్ ప్లాట్‍‌ఫాం భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం.అందుతున్న సమాచారం మేరకు ఓటీటీ ట్రేడ్ లో … హిట్ 2 చిత్రానికి భారీగా బిజెనెస్ జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో హిట్ 2 చిత్ర స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాని భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ కూడా తీవ్రంగా పోటీ పడగా.. చివరకు ప్రైమ్ వీడియోకే భారీ ధరకు ఈ రైట్స్ దక్కాయి. ఓటీటీలో ఈ సినిమా జనవరి నెలలో విడుదలకు ప్లాన్ చేసిన్నట్లు తెలుస్తోంది. జనవరి 2, జనవరి 6 కానీ రిలీజ్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement