Thursday, April 18, 2024

విశాఖకు అమెజాన్‌… 184.12 కోట్ల పెట్టుబడితో ఫెసిలిటీ సెంటర్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీలో మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖలో అమెజాన్‌ సంస్థ తన డెవలప్‌ మెంట్‌, ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఫెసిలిటీ సెంటర్‌ కోసం విశాఖలో రూ.184.12 కోట్ల పెట్టు-బడిని తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్‌ పెట్టుబడుల కోసం ప్రాథమిక నిర్ణయం పూర్తి చేసుకొని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్స్క్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది. 2023లో ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వానికి వివరించింది. అమెజాన్‌ సంస్థ పెట్టుబడులపై సాప్ట్‌nవేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా స్వయంగా ట్వీట్‌ చేసింది. డెవలప్‌ మెంట్‌ సెంటర్‌, ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటుతో ఐటీ ఉద్యోగాలతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం విశాఖలో విప్రో, టెక్‌ మహీంద్రా, కండ్యూయెంట్‌, మిరాకిల్‌ సిటీ వంటి సంస్థలు అక్కడే ఏర్పాటయ్యాయి.

ప్రత్యేక దృష్టి..

మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో విశాఖపట్నంపై వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా మహా విశాఖ నగరాన్ని ఇన్‌ఫర్‌ మేషన్‌ టెక్నాలజీ క్యాపిటల్‌ సిటీగా మార్చేందుకు సన్నాహలు చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌కు రాబోయే ఐటీ కంపెనీలన్నింటికీ విశాఖపట్నం, భీమిలీ, భోగాపురం పరిసర ప్రాంతాలను కేంద్ర బిందువుగా మార్చనుంది. ఇందు కోసం ఐటీ, ఇండ స్ట్రియల్‌ క్లస్టర్లను ప్రకటించే దిశగా యాక్షన్‌ప్లాన్‌ రూపొందిస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక డెంకాడ, ఆనందపురం, భీమిలీ ప్రాంతాల్లో ఐటీ, ఇండస్ట్రిల్‌ క్లస్టర్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొం దిస్తోంది. 2025 నాటికి భోగపురం విమానాశ్రయం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అప్పటి లోపు ఆరులైన్ల రహదారిని పూర్తి చేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖకు దిగ్గజ కంపెనీలు చూస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement