Wednesday, April 24, 2024

అమెజాన్ సరికొత్త ఆఫర్.. రూ.2కే నాలుగు నెలల సబ్‌స్క్రిప్షన్

పుస్తకాల ప్రియుల కోసం అమెజాన్‌ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్‌కు చెందిన అడిబుల్‌ యాప్‌ నాలుగు నెలల సబ్‌స్క్రిప్షన్‌ కేవలం రూ.2 కే అందించనుంది. అడిబుల్‌లో వినియోగదారులు పుస్తకాలను వినవచ్చు. అంతేకాకుండా విభిన్నమైన పాడ్‌కాస్ట్‌లను కూడా అడిబుల్‌ అందిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది. అంతేగాకుండా ఈ ఆఫర్ కేవలం మొదటిసారి జాయిన్ అయ్యే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కాగా అడిబుల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే పుస్తకప్రియులు వారికి నచ్చిన పుస్తకాలను నచ్చిన సమయంలో వినవచ్చు. ఇక ఈ అడిబుల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అమెజాన్ కేవలం రూ.199కి మాత్రమే అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే వర్తించనుంది.

ఈ వార్త కూడా చదవండి: పరుగులు తీస్తున్న పసిడి ధర

Advertisement

తాజా వార్తలు

Advertisement