Tuesday, March 26, 2024

Breaking: వాతావరణం అనుకూలిస్తే.. రేపటి నుంచి అమర్​నాథ్​ యాత్ర తిరిగి ప్రారంభం

వాతావరణం అనుకూలిస్తే రేపు (సోమవారం) అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఐదు రోజుల క్రితం వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రను నిలిపివేశారు. దక్షిణ కాశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ బేస్ క్యాంపు నుంచి యాత్రికుల బృందం బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా.. జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర గుహ పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్ సమీపంలో క్లౌడ్‌బరస్ట్​తో సంభవించిన వరదల కారణంగా తప్పిపోయిన 40 మందిని కనుగొనడానికి రెస్క్యూ ఆపరేటర్లు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.  శుక్రవారం, శనివారం వరకు చిక్కుకుపోయిన 15,000 మంది యాత్రికులను అధికారులు రక్షించి పంజ్‌తర్ని దిగువ బేస్ క్యాంపుకు తరలించారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుపోయారనే భయంతో గాలింపు చర్యలు విరామం లేకుండా కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement