Wednesday, March 27, 2024

మా భూముల్ని ఎవరూ లాక్కోలేదు

రాజధాని అసైన్డ్‌ భూములపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు పలువురు రాజధాని దళిత రైతులు హాజరయ్యారు. తమ భూముల్ని రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చామన్న రైతులు తెలిపారు. తమ భూముల్ని ఎవరూ లాక్కోలేదని, బెదిరించలేదని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందిందని రైతులు చెప్పారు.
మరోవైపు అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. రాజధాని అసైన్డ్‌ భూముల అంశంలో సీఐడీ దాఖలు చేసిన కేసులో అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసైన్డ్ భూముల విషయంలో జీవోలు జారీ చేయడంలో అధికారుల పాత్రపై సీఐడీ ఆరా తీస్తోంది. అప్పటి గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్ పాత్రపై సమాచారం సేకరించే పనిలో పడిపోయింది సీఐడీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement