Wednesday, April 17, 2024

నేను కోలుకుంటున్నా.. త‌మిళంలో ట్వీట్ చేసిన విజ‌య్ ఆంటోని

న‌న్ను ప్రేమించే హృద‌యాల‌కు కృత‌జ్ఞ‌త‌లు..నేను 90శాతం న‌య‌మ‌య్యాయ‌ని ట్వీట్ చేశారు త‌మిళ హీరో విజ‌య్ ఆంటోని.నా విరిగిన దవడ, ముక్కు ఎముకలు కలిసిపోయాయి. మీ అభిమానం వల్ల నేను గతంలో కంటే ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నాను. ఏప్రియ‌ల్‌లో విడుదల కానున్న పిచైకారన్ 2 పనులను ప్రారంభిస్తాను అంటూ అప్డేట్ అందించారు. కాగా
బిచ్చగాడు 2’ షూటింగ్ మలేషియాలో చిత్రీకరణ జరపగా.. గత నెల జనవరి 16న హీరో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో విజయ్ దవడ ఎముకలు, ముక్కు బాగా దెబ్బతింది. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అందించడంతో విజయ్ తిరిగి మామూలు స్థితికి చేరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యంపైనా ట్వీటర్ వేదిక అప్డేట్ అందిస్తున్నా.. అభిమానులు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విజయ్ ఆంటోనీనే స్వయంగా తన ఆరోగ్యంపై అప్డేట్ అందించారు. తమిళంలో ట్వీట్ చేస్తూ హెల్త్ కండీషన్ ను తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement