Saturday, April 20, 2024

అభివృద్ధి పై ఎప్పుడూ చర్చకు సిద్ధమే : మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి సిటీ : చిత్తూరు జిల్లా అభివృద్ధి పై చర్చకు సవాల్ చేసిన తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలాయనం చిత్తగించాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం వైఎస్ఆర్సిపి 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మారుతి నగర్ లో వైఎస్ఆర్సిపి జెండా ఆవిష్కరణ చేశారు. విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్సిపి 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్త‌దాన శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొత్త వరవడిని ప్రజల్లో తీసుకురావడం జరుగుతుందని, వైఎస్ఆర్సిపి పార్టీ వంద సంవత్సరాలు పరిపాలన సాగాలని కోరుకుంటున్నాం అన్నారు. ఈనెల 13వ తేదీ జరగనున్న పశ్చిమ తూర్పు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరుగుతుందని దేమో వ్యక్తం చేశారు. ఎంత ఎక్కువ పోలింగ్ జరిగితే అంత ఎక్కువ మెజార్టీ వస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి తంబళ్ల పల్లెలోని ప్రస్తుతం ఉన్నారన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తప్పుడు సమాచారం చెప్పి లొకేష మాట్లాడిస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి స్వయంగా సవాలు చేసిన కనిపించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం. టిటిడి పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, వైఎస్ఆర్సిపి నాయకులు ఎంఆర్సి రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement