Thursday, April 25, 2024

పోలీస్ గా శ్రీ విష్ణు-అల్లూరి ఫ‌స్ట్ లుక్ రిలీజ్

పోలీస్ గా అల‌రించ‌నున్నాడు హీరో శ్రీ విష్ణు. ఆయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రం అల్లూరి. ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయింది.లేటెస్ట్‌గా విడులైన ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో శ్రీవిష్ణు పోలీస్ గెట‌ప్‌లో చేతిలో గ‌న్ ప‌ట్టుకుని ఇంటెన్సీవ్‌గా చూస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు శ్రీ విష్ణు పోలీస్ పాత్ర‌లో న‌టించ‌లేడు. మొద‌టి సారిగా పోలీస్ రోల్‌లో సినిమా చేస్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తి పెరిగింది. ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తున్న ఈ చిత్రాన్ని ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు. శ్రీ విష్ణూ ఎప్ప‌టిలాగానే ఈ సారి కూడా విభిన్న క‌థ‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. కాగా ఈసారి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను కూడా జోడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement