Saturday, April 20, 2024

‘పుష్ప’రాజ్ హవా… తగ్గేదే లే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్టైనర్ పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ను అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 7న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ లో ‘తగ్గేదే లే’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ అందరినీ అట్రాక్ట్ చేసింది. టీజర్ విడుదలై మూడు రోజులు కావస్తున్నా… నెట్టింట్లో ఇంకా ‘పుష్ప’రాజ్ హవా కొనసాగుతోంది. తాజాగా ‘పుష్ప’రాజ్ 1 మిలియన్ లైక్స్ క్రాస్ చేసింది. అంతేకాదు 30+ మిలియన్ వ్యూస్ తో సత్తా చాటాడు.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 13న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీతో సుకుమార్, అల్లు అర్జున్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement