Saturday, September 7, 2024

ఐసెట్‌ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి.. 83 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఐసెట్‌ తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. మొత్తంగా ఎంబీఏలో 21983 సీట్లు భర్తీ కాగా, ఎంసీఏలో 2865 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసీఏ సీట్లు వంద శాతం భర్తీకాగా ఎంబీఏ సీట్లు మాత్రం 2295 సీట్లు మిగిలాయి. 83 కాలేజీల్లో వంద శాతం సీట్లు నిండాయి. అందులో 15 యూనివర్సిటీలు ఉండగా, 68 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 254 ఎంబీఏ కాలేజీల్లోని 24278 సీట్లల్లో 21983 సీట్లు భర్తీ అయ్యాయి. 48 ఎంసీఏ కాలేజీల్లోని 2865 సీట్లల్లో వంద శాతం నిండాయి. ఈనెల 31వ తేదీ వరరు సీటు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement