Thursday, April 25, 2024

బీఈడీ ఫైనల్‌ ఫేజ్‌లో 7054 సీట్లు కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీఈడీ ద్వితీయ, తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. కన్వీనర్‌ కోటాలో మొత్తం 9413 సీట్లకు ఫైనల్‌ ఫేజ్‌ ద్వారా 7054 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మొత్తం 11,746 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోగా 7054 మందికి సీట్లను కేటాయించినట్లు టీఎస్‌ సెట్స్‌ కన్వీనర్‌ ప్రొ.పి.రమేష్‌ బాబు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్‌ ఫీజును బ్యాంకు చలాన్‌ ద్వారా చెల్లించాలని సూచించారు.

ఆ తర్వాత ఆయా కాలేజీల్లో ఈనెల 7వ తేదీలోపు రిపోర్ట్‌ చేయాలని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 14285 బీఈడీ సీట్లల్లో మొదటి విడతలో 10,053 మందికి కేటాయించగా అందులో 5222 మంది మాత్రమే ఇప్పటి వరకు కాలేజీల్లో రిపోర్ట్‌ చేశారు. సెకండ్‌, ఫైనల్‌ ఫేజ్‌లో 9413 సీట్లల్లో 7054 మందికి సీట్లను కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement