Friday, March 29, 2024

విడాకుల వార్తలన్నీ రూమర్సే.. క్లారిటీ ఇచ్చిన నటుడు శ్రీకాంత్

ఈ మధ్యకాలంలో పలువురు సినీ సెలబ్రిటీలు విడాకుల వార్తలతో నిలుస్తున్నారు. అదే తరహాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ తన భార్య ఊహకి విడాకులు ఇవ్వనున్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించాడు శ్రీకాంత్. ఎట్టకేలకు తన భార్యతో విడాకుల పై హీరో శ్రీకాంత్ స్పందిస్తూ అసలు విషయం తెలియజేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ..” ప్రస్తుతం నేను, నా భార్య షూటింగ్ లో బిజీగా ఉన్నాం. మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.. అయితే ఈ వార్తల్లో అసలు నిజం లేదు. ఇవన్నీ పుకార్లే అంటూ ఆ వార్తలను కొట్టి పారేశారు శ్రీకాంత్. మొత్తానికైతే శ్రీకాంత్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలు ఫేక్ అని స్పష్టం అయింది. హోమ్లీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ సహా నటి ఊహను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.. ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement