Thursday, April 25, 2024

ఐపీఎల్ కు ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో రిటైర్మెంట్ ..

ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ గా ఎంపిక చేసింది సీఎస్కే ప్రాంచైజీ. గత కొన్నేళ్లుగా ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో చెన్నై తరపున ఆడి, ఎన్నో విజయాలు అందించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసింది ఇతడే. మరోవైపు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ పొలార్డ్ ఐపీఎల్ నుంచి తప్పుకొని, ముంబై బౌలింగ్ కోచ్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు.

ఇక ఇప్పుడు వెస్టిండీస్ దిగ్గజ ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రావోను బౌలింగ్ కోచ్‌గా నియమించిన విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో లక్ష్మీపతి బాలాజీ ఏడాదిపాటు కోచింగ్‌కు దూరంగా ఉండనుండటంతో.. అతడి స్థానంలో బ్రావో తమ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తాడని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement