Tuesday, March 26, 2024

ఫరూక్‌ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు.. మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌

మనీలాండరింగ్‌ కేసులో జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. మే 31వ తేదీన తమ ప్రధాన కార్యాలయానికి రావాలని అందులో తెలియజేసింది. జమ్ము కాశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (జేకేసీఏ)లో జరిగిన అవతవకల గురించి ఫరూక్‌ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలిసింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ కింద ఈ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ 2020లోనే ఫరూక్‌ అబ్దుల్లాకు సంబంధించిన 11.86 కోట్ల ఆస్తులను స్తంభింపజేసింది. ఈ కేసులో ఇప్పటికే అబ్దుల్లాను ఈడీ పలు మార్లు విచారించింది. జేకేసీఏ అధ్యక్షుడిగా అబ్దుల్లా తన పదవిని దుర్వినియోగం చేశారని, బీసీసీఐ ఇచ్చిన నిధులను మళ్లించారని ఆరోపణలు వచ్చాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement