Friday, December 2, 2022

కేసులన్నీ త్వరగా పరిష్కారమవ్వాలి.. అప్పుడే నేరస్థుల్లో భయం పుడుతుంది: నిర్మలా సీతారామన్‌

ప్ర‌భ‌న్యూస్ : ప్రతి కేసుకు తరితగతిన తార్కిక (లాజికల్‌) ముగింపు ఇవాలని ఇంటెలిజెన్సీ వింగ్స్‌ అధికారులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. తద్వారా స్మగ్లింగ్‌ వంటి ఆర్థిక నేరాలకు పాల్పడే నేరస్థులు భయపడతారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) 64వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆమె మాట్లాడారు. తార్కిక ముగింపు చాలా కీలకమని సీతారామన్‌ వ్యాఖ్యానించారు. అధికారులకు భారీగా ఇంటెలిజెన్స్‌ సమాచారం ఉంటుంది. కానీ కొన్నిసార్లు, ఇది నిజంగా చర్యలు తీసుకోవాల్సి ఉన్న అంశమా కాదా అనేది చాలా క్లిష్టంగా మారుతుంది. కొన్నిసార్లు సాధారణంగానే ఉంటాయి. క్లిష్టంగా మారే అంశాలపై తగిన విధంగా వ్యవహరించేందుకు వ్యవస్థీకృతంగా బలోపేతమవ్వాలని సీతారామన్‌ పిలుపునిచ్చారు.

సమాచారంపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని ఆమె అభిలాషించారు. ఆయా సంస్థల అనుభవపూర్వకంగా డీఆర్‌ఐ ఆధారిత ఏజెన్సీలు చట్టవిరుద్ధ చర్యల నివారణకు పలు సూచనలు చేయవచ్చునని ఆమె కోరారు. ఇలాంటి చర్యలను అరికట్టడమే కాకుండా పట్టుబడినవారికి శిక్షలు కూడా ఎక్కువగా ఉండాలని ఆమె హెచ్చరించారు. విష వ్యర్థాలపై డిపింగ్‌ చేయడంపై డీఆర్‌ఐ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో దశాబ్దాలుగా క్రమంగా నిర్మిస్తుండడంతో రీసైకిల్‌ సామర్థ్యం పెరిగిందన్నారు. సముద్ర తీరాలలో విష వ్యర్థాలపై ఎక్కువగా డీఆర్‌ఐ దృష్టిపెట్టాలన్నారు. డీఆర్‌ఐకి మీడియా కవరేజీ పెరిగితే నేరస్థులకు భయం పుడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement