Friday, May 20, 2022

ఇజ్రాయెల్‌లో అల్‌ జజీరా జర్నలిస్టు కాల్చివేత..

ఇజ్రాయెల్‌ పాలస్తీనా మధ్య జరుతున్న ఘర్షణలలో మరో జర్నలిస్టు కన్నుమూశారు. పాలస్తీనాలోని జెనిన్‌ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులకు సంబంధించిన వార్తలను అల్‌జజీరా టీవీ చానల్‌ రిపోర్టర్‌ షరీన్‌ అబు అఖ్లే కవర్‌ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇజ్రాయెల్‌ సైన్యం ఇక్కడ దాడులు చేస్తున్నది. ఈ దాడులను వివరంగా ఆమె సవివరంగా అందిస్తున్నారు.

అయితే, బుధవారం నాడు కూడా ఇక్కడ విధి నిర్వహణలో ఉన్న ఆమె ఇజ్రాయెల్‌ దళాల కాల్పుల్లో కన్నుమూశారు. మరో జర్నలిస్టుకు కూడా గాయాలైనాయి. ఘటన సమయంలో షరీన్‌ బుల్లెట్‌ జాకెట్‌ ధరించి ఉన్నారనీ, దానిపై ప్రెస్‌ అన్న అక్షరాలు కూడా ఉన్నాయనీ, తలకు హెల్మెట్‌ కూడా పెట్టుకున్నారనీ అయినా… ఆమె ఇజ్రాయెల్‌ సైనికుల కాల్పుల్లో మరణించడం అనుమానాలకు తావిస్తున్నదని అల్‌ జజీరా తెలియజేసింది. ఆమెను తలపై ట్రిగ్గర్‌ పెట్టి కాల్చి చంపారని ఆరోపించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement