Thursday, April 18, 2024

మీకు సమస్య వస్తే దండం పెడతారు…మేం పిండం పెడతాం..అఖండ ట్రైలర్ అదుర్స్..

హీరో బాలకృష్ణ ఫ్యాన్స్ కి పూనకాలు రావాల్సిందే..అఖండ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో డైరెక్టర్ – బోయపాటి మార్క్ కొట్టి వచ్చినట్టు కనిపిస్తోంది. అంచనా వేయడానికి నువ్వేమయినా పోలవరం డ్యామా..పట్టిసీమ తూమా..పిల్ల కాలువ అంటూ బాలయ్య డైలాగ్ గూజ్ బంప్స్ తెప్పిస్తున్నాయి..ఇక శ్రీకాంత్ చెప్పిన నాకు దురదొచ్చింది,బురదంటింది లాంటి డైలాగులతో అదరగొట్టాడు..ఇక జగపతిబాబు కళ్ళు తెరిచి జూలు విదిలిస్తే అంటూ రెచ్చిపోయారు. మీకు సమస్య వస్తే దండం పెడతారు..కానీ మేం పిండం పెడతాం లాంటి డైలాగులు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. కథానాకయికగా ప్రగ్యా జైస్వాల్ అలరించనుంది. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను శ్రీకాంత్ పోషించగా, కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement