Wednesday, November 30, 2022

గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు.. రెడ్ కార్పెట్ పై సందడి చేసిన చిత్ర టీం

అఖండ మూవీకి మరో గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో స్క్రీనింగ్ అయింది ఈ మూవీ. హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రని పోషించారు. ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించగా.. శ్రీకాంత్, పూర్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 28న చలన చిత్రత్సోవాలు ముగియనున్నాయి.ఈ ఈవెంట్‌లో సినిమా హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. ఈ ముగ్గురు థంబ్స్ అప్‌ సింబల్‌ చూపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ చిత్రంలో బాలకృష్ణ డ్యుయల్‌ రోల్‌లో నటించారు. అఖండ బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎస్‌ థమన్‌ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ అఖండ విజయంలో కీ రోల్‌ పోషించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement