Tuesday, May 18, 2021

ఫ్యాన్ సెల్ఫీ ఉత్సాహం.. ఫోన్ లాక్కున్న అజిత్!

సెలబ్రెటీలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కొన్నిసార్లు ఆ తరాలకు తలనొప్పిగా మారుతుంటుంది. ఎక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ వారిని చుట్టుముడుతుంటారు. తాజాగా ఓ అభిమాను అతి ఉత్సహం కారణంగా స్టార్ హీరో అజిత్ వార్తల్లో నిలిచాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటు వేయడానికి సామాన్యులతో సెలబ్రిటీలు పోటెత్తారు. ఈక్రమంలో హీరో అజిత్ తన ఇంటికి సమీపంలోని ఓ పోలింగ్ కేంద్రానికి తన భార్యతో కలిసి ఓటు వేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో మాస్క్ లేని ఓ అభిమాని అతనితో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో సదరు అభిమానిపై హీరో అజిత్‌కు కోపం వచ్చింది. ఆ అభిమాని చేతిలోని ఫోన్‌ను లాక్కొన్నాడు. పోలింగ్ బూత్ లో భార్య శాలినీతో కలిసి ఓటు వేసిన వచ్చిన తర్వాత సదరు అభిమానికి అతని ఫోన్ తిరిగి ఇచ్చారు. అంతే కాదు సారీ అంటూ క్షమాపణలు చెప్పాడు. అజిత్ అభిమాని ఫోన్ లాక్కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా, గతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సైతం ఓ అభిమాని చేతిలో నుంచి సెల్ ఫోనో లాక్కున్న సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా తనను వీడియోలో చిత్రీకరించడం సల్మాన్ కోపానికి కారణమైంది. సల్మాన్ ఆ అభిమాని నుంచి ఫోన్ లాగేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News