Thursday, November 7, 2024

నెట్ ఫ్లిక్స్ లో తెగింపు.. అజిత్ కెరిర్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్

అజిత్ హీరోగా న‌టించిన చిత్రం తెగింపు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో రూపొందిన తెగింపు సినిమాలో మంజు వారియర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న తెలుగుతో పాటు తమిళంతో ఒకేరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీ లోకి రాబోతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారుసంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా రిలీజ్ అయింది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కాకముందే తునివు ఓటీటీలోకి రాబోతుండటం సిని వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా రూ.250 కోట్ల కలెక్షన్‌లు సాధించి అజిత్‌ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. డివైడ్‌ టాక్‌తో అజిత్‌ ఈ రేంజ్‌లో కలెక్షన్‌లు సాధించడాడంటే ఆయన క్రేజ్‌ తమిళ్‌లో ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ పూర్తి చేసుకోకుండానే థియేటర్‌లలో నుండి వెళ్లిపోయింది. అజిత్‌ గత సినిమాలతో పోల్చితే తునివు సినిమాకు తెలుగులో ఎక్కువే బిజినెస్‌ జరిగింది. దాదాపు మూడు కోట్ల బిజినెస్‌ జరుపుకున్న ఈ చిత్రం రెండు కోట్ల రేంజ్‌లో కలెక్షన్లు సాధించి యావరేజ్‌ హిట్‌గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement