Tuesday, April 23, 2024

‘మా’ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది: దర్శకుడు అజయ్ భూపతి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల హంగామా కొనసాగుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య ఆసక్తికర పోటీ నడుస్తోంది. ఈ క్ర‌మంలో ఆర్ఎక్స్100 చిత్రాన్ని తెర‌కెక్కించిన అజ‌య్ భూప‌తి.. మా ఎన్నిక‌ల‌లో పోటీ చేయాల‌నుంద‌ని పేర్కొన్నాడు. ‘ఈ థ్రిల్లర్ ఎపిసోడ్‌లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి, ‘మా’లో కార్డు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలనుంది’ అని అన్నాడు. ఇది ఎవ‌రిని ఉద్దేశించి అన్నారో, ఎందుకు అన్నారో తెలియ‌దు కాని అజ‌య్ చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన మ‌హా సముద్రం చిత్రంలో శర్వానంద్, సిద్దార్థ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించారు. జగపతి బాబు, రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అక్టోబర్ 14 న ‘మహా సముద్రం’ రిలీజ్ కాబోతుంది . ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామ బ్రహ్మం నిర్మించారు. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement