Thursday, April 25, 2024

ఎయిర్‌టెల్‌ కొత్త పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌.. రెండు సిమ్‌లు, ఉచిత డీటీహెచ్‌ పొందవచ్చు

ఎయిర్‌టెల్‌ పోస్ట్‌ పెయిడ్‌ యూజర్ల కోసం బ్లాక్‌ పేరుతో కొత్త ప్లాన్‌ను తీసుకు వచ్చింది. నెలకు 799 రూపాయలకు లభించే ఈ ప్లాన్‌లో టెలికం సర్వీస్‌లతో పాటు, డీటీహెచ్‌ సేవలు పొందవచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఇది ఎయిర్‌టెల్‌ ప్రీమియం సర్వీస్‌. ఇందులో ఓటీటీ సేవలు కూడా అభిస్తాయి. ఈ ప్లాన్‌లో కస్టమర్‌ రెండు సిమ్‌ కార్డులు తీసుకోవచ్చు. బ్లాక్‌ ప్లాన్‌లో నెలకు 105 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్‌, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. వినియోగించిన డేటాను తదుపరి నెలకు బదిలీ అవుతుంది. 260 రూపాయల విలువైన టీవీ ఛానెళ్లు డీటీహెచ్‌ కనెక్షన్‌తో లభిస్తాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, మరికొన్ని ఓటీటీ సేవలు ఈ ప్లాన్‌తో పొందవచ్చు.

- Advertisement -

బ్లాక్‌ ప్లాన్‌లో పోస్ట్‌ పెయిడ్‌ యూజర్లకు వన్‌ బిల్‌, వన్‌ కాల్‌ సెంటర్‌ సేవలు లభిస్తాయి. ఫిర్యాదుల పరిషారానికి ప్రత్యేక టీమ్‌ ఉంటుంది. వీటితో పాటు ఎయిర్‌టెల్‌ షాపులై బై నౌ పే లేటర్‌ సదుపాయం ఉంటుంది. 5జీ సర్వీస్‌ అందుబాటులోఉన్న ఏరియాలో అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ఎయిర్‌టెల్‌ నుంచి కుటుంబ సభ్యులు వినియోగించేందుకు అనువుగా వేర్వేరు పోస్ట్‌ పెయిడ్‌ పథకాలను భారతీ ఎయిర్‌టెల్‌ ఆవిష్కరించింది. నెలకు 599-1499 అద్దెపై లభించే ఈ పథకాల్లో అపరిమిత కాల్స్‌, వంద ఎస్‌ఎంఎస్‌లు, నెలకు 105 నుంచి 320 జీబీ డేటా లభిస్తుంది. కుటుంబంలో 2నుంచి 5గురు స భ్యులు ఉపయోగించుకోవచ్చు. 599 రూపాయల పథకాన్ని ఇద్దరు, 999-1199 రూపాయల పథకాన్ని నలుగురు, 1499 పథకాన్ని 5గురు ఉపయోగించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement