Friday, April 26, 2024

విమాన క్యాబిన్ల ఆధునీకరణ.. 400 మిలియన్లు ఖర్చు చేయనున్న ఎయిర్‌ ఇండియా

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా విమాన క్యాబిన్ల ఆధునీకరణకు 400 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనుంది. ప్రధానంగా బోయింగ్‌ 777, 787 ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యాబిన్లను ఆధునీకరించనుంది. అంతర్జాతీయ సర్వీస్‌ల విషయం లో ఉన్న తీవ్రమైన పోటీని తట్టుకునేందుకు, దేశంలో దూరప్రాంతాల సర్వీస్‌లను మెరుగుపరిచేందుకు ఇది దోహదం పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఇంటిరియర్‌ను మెరుగుపరచడంతో పాటు, అదనపు సీట్లను ఏర్పాటు చేయనున్నారు. సంస్థలో ఉన్న మొత్తం 27 బోయింగ్‌ 787, 13 బోయింగ్‌ 777 విమానాలను పూర్తి స్థాయిలో ఆధునీకరించనున్నారు. వీటిలో ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను పునరుద్ధరించనున్నారు. బోయింగ్‌ 777లో ఫస్ట్‌ క్లాస్‌ క్యాబిన్‌ క్యాబిన్‌ను అలాగే ఉంచి ఆధునీకరిస్తారు.

- Advertisement -

ఇంటీరియర్‌ పనులను లండన్‌కు చెందిన జీపీఏ డిజైన్‌కు అప్పగించారు. మార్పులకు సంబంధించిన అన్ని అనమతులు తీసుకున్నామని, ఆధునీకరించిన సర్వీస్‌లు 2024 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 44 శాతం మంది అంతర్జాతీయ ప్రయాణీలను ఇండియాకు చెందిన విమనయాన సంస్థలు తీసుకెళుతున్నాయి. ఇందులో ఇండిగో 15 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఎయిర్‌ ఇండియా 11 శాతం వాటా కలిగి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement