Thursday, April 25, 2024

ఎయిర్‌ ఇండియా సబ్సిడరీగా ఎయిర్‌ ఆసియా.. అతిపెద్ద లోకాస్ట్‌ ఎయిర్‌లైన్‌గా ఆవిర్భావం

టాటా సన్స్‌ ఇక నుంచి ఎయిర్‌ ఏషియాకు పూర్తి స్థాయి యజమానిగా మారనుంది. బుధవారం నాడు ఎయిర్‌ ఏషియా ఏవియేషన్‌ గ్రూప్‌తో మిగిలిన 16.3 శాతం వాటా కొనుగులు ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్‌ ఏషియాలో టాటా సన్స్‌ జాయింట్‌ వెంచర్‌లో ఎయిర్‌ ఏషియా ఇండియా ఆపరేషన్స్‌ నిర్వహిస్తోంది. గతంలోనే ఎయిర్‌ ఏషియా లో కొంత వాటాను కొనుగోలు చేసిన టాటా సన్స్‌ తాజాగా మిగిలిన వాటా 16.3 శాతాన్ని 155.6 కోట్లకు కొనుగోలు చేసే ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇక నుంచి ఎయిర్‌ ఏషియా ఇండియా వంద శాతం ఎయిర్‌ ఇండియా సబ్సిడరీగా ఉంటుందని ఒప్పందం తరువాత కంపెనీ సీఈఓ, ఎండీ సునీల్‌ భాస్కరన్‌ చెప్పారు.

ఎయిర్‌ ఏషియా ఇక నుంచి ఎయిర్‌ ఇండియాలో భాగం కావడంతో లోకాస్ట్‌ ఎయిర్‌లైన్స్‌లో అతి పెద్ద సంస్థగా మారిందని ఆయన చెప్పారు. ఎయిర్‌ ఏషియా బర్హడ్‌, ఎయిర్‌ ఏషియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య ఉన్న సాంకేతిక, సర్వీస్‌ ఒప్పందం షేర్‌ హోల్డర్ల ఆమోదం తరువాత 12 నెలల్లోగా ముగుస్తుంది. ఎయిర్‌ ఇండియాలో ఇప్పటికే విలీనమైన విస్తారా ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా, టాటాలకు 51 శాతం వాటాలు ఉన్నాయి. ఎయిర్‌ ఏషియా, టాటా సన్స్‌ మధ్య 2014లో జాయింట్‌ వెంచర్‌ ఒప్పందం చేసుకున్నాయి. 2021, జనవరిలో టాటా సన్స్‌ 32.67 శాతం వాటాను ఎయిర్‌ ఏషియా బర్హడ్‌ నుంచి కొనుగోలు చేసింది. తాజాగా మిగిలిన వాటాను కూడా ఇప్పుడు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement