Tuesday, April 16, 2024

స్కూల్స్ ఓపెన్ పై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు

దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టించింది. అన్నీ సంస్థలు కూడా మూతపడ్డాయి. ముఖ్యంగా స్కూల్స్ ఓపెన్ చేసుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఆన్లైన్ క్లాసులు కే పరిమితం కావాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఆన్లైన్ క్లాసులు అందరికీ కుదరట్లేదు. దీంతో కరోనా ఎప్పుడు తగ్గుతుందా స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక పరిస్థితులు బట్టి దశలవారీగా స్కూళ్లను ఓపెన్ చేయవచ్చని, స్కూల్స్ మూసివేత పిల్లల పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. కేసులు తక్కువగా ఉన్న జిల్లాలలో స్కూల్స్ తెరువవచ్చని కరోనా పాజిటివ్ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాలలో ఓపెన్ చేయటానికి ప్రణాళికలు రూపొందించుకోవచ్చు అని చెప్పుకొచ్చారు.

కరోనా పెరిగితే స్కూళ్లను మూసివేయడం, రోజు విడిచి రోజు స్కూళ్లకు విద్యార్థులను రప్పించటం వంటి పద్ధతులను పాటించే విధంగా ప్లాన్ చేయాలన్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి స్కూళ్లలో ఉండాలని….పిల్లలు వైరస్ బారిన పడటం మంచిదేనని దీనివల్ల చాలామంది పిల్లల్లో సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement