Wednesday, April 17, 2024

ఆహా కోసం హోస్ట్ గా వెంక‌టేష్ – ఒప్పించే ప్ర‌య‌త్నంలో ‘అల్లు అర‌వింద్’

వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పై కూడా త‌మ హ‌వాని చాటుతున్నారు ప‌లువురు స్టార్స్. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌, రానా ఇలా ప‌లువురు హోస్ట్ గా మారారు. ఆ కార్య‌క్ర‌మాల‌న్నీ భారీ రేటింగ్ ని సాధించాయి. ఇటువంటి వాటికి హీరో వెంకటేశ్ దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. కానీ, ఇప్పుడు ‘రానా నాయుడు’ అనే ఒక వెబ్ సిరీస్ లో చేస్తున్నారు వెంక‌టేష్. ఇక ఆహా ఓటీటీ కోసం హోస్టుగా మార‌నున్నార‌ట వెంక‌టేష్ అనే వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కొత్త సినిమాలతో .. వెబ్ సిరీస్ లతో కొత్త కాన్సెప్ట్ లతో ‘ఆహా’ దూసుకెళుతోంది. ఆహాలో బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ ఇప్పటికే నెంబర్ వన్ గా నిలిచింది. దాంతో కొత్తగా మరో షోను ప్లాన్ చేస్తున్నారు. ఈ షో కోసం హోస్టుగా వెంకటేశ్ ను సంప్రదిస్తున్నారట. ఆయనను ఒప్పించడానికి అల్లు అరవింద్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారట‌. మ‌రి వెంక‌టేష్ కూడా ఇత‌ర హీరోల మాదిరిగా ఆలోచించి హోస్ట్ గా మార‌తారేమో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement