Friday, March 29, 2024

ఆహాలో సమ్మతమే.. రిలీజ్​ డేట్​ త్వరలోనే ఉంటుందట!

యువ నటుడు కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు మూవీతో 2019లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆకట్టుకునే ప్రదర్శనలు, హిట్ మూవీస్​తో పరిశ్రమలో త‌న‌కంటూ ఓ ప్లేస్​ని ఏర్పరుచుకున్నాడు. కాగా, అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన సమ్మ‌తమే మూవీ ఈ మధ్యనే రిలీజ్​ అయ్యింది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్ ఫుల్ డ్రామాలో చాందిని చౌదరి హీరోయిన్​గా నటించింది.

రిలీజ్ అయిన రోజు నుంచి యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీగా మంచి టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. అయితే తాజా నివేదికల ప్రకారం.. ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్టైనర్ OTT ప్లాట్‌ఫారమ్‌ను కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం నటించిన మూవీ సమ్మ‌త‌మే ఇప్పుడు ఆహా వీడియో ప్లాట్‌ఫారమ్‌లో త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. అధికారికంగా ఓటీటీ విడుదల తేదీకి సంబంధించి త్వరలో ప్రకటన ఉంటుందని మువీ టీమ్​ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement