Sunday, June 4, 2023

వ్యవసాయం పరిశ్రమగా విస్తరించాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

మనోహరాబాద్ ప్రభ న్యూస్ : ఆధునిక పరికరాలు వ్యవసాయ రంగానికి ఎంతో అవసరమని, నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న పరికరాలతో రైతులకు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మండలంలోని టీఎస్ఐఐసి పారిశ్రామిక వాడలోని అక్షయ అగ్రి పరిశ్రమను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. పరిశ్రమ యజమానులు మంత్రికి వివరిస్తూ.. రూ.20 కోట్ల వ్యయంతో 1 స్థలంలో ఆర్అండ్ డి పరిశ్రమ ఏర్పాటు చేశామని, అలాగే సిరిసిల్ల టిఎస్ఐఐసి పారిశ్రామిక వాడలో రు.60 కోట్ల వ్యయంతో 20 ఎకరాల విస్తీర్ణంలో నూతన పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు సూచించారు. పరిశ్రమ ఆవరణలో మంత్రి మొక్కను నాటారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయం ఒక పరిశ్రమగా విస్తరించాలని, వ్యవసాయ రంగంలో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటుందని రైతులకు వ్యవసాయ ఆధునిక పరికరాలు అందించడం ఎంతో అవసరమన్నారు. దేశంలో వ్యవసాయ పనితీరు మారాలని రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గడానికి ఆధునిక యంత్రాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన ఆధునిక వ్యవసాయ యంత్రాంగ పరిశ్రమలు ఏర్పాటు చేయడం భేష్ అని యాజమాన్యాన్ని అభినందించారు. రాష్ట్రంలో 91% రైతులు 5 ఎకరాల లోపే ఉన్నారని తక్కువ భూమి ఉన్న అందులో అద్భుతమైన పంటలు పండించే సత్తా తెలంగాణ రైతులకు ఉందని సూచించారు. రాష్ట్రంలో రైతాంగ అభివృద్ధి పరచడం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రైతులు కష్టంతో కాకుండా ఇష్టంతో పని చేస్తూ సులభంగా పంటలు పండించే విధంగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దుతామని, దేశంలో మౌలిక వసతులు అనేక రంగాల్లో ఉన్నాయని ప్రపంచంలో అన్ని దేశాలకు భారతదేశమే ఆహారం అందించగల సత్తా ఉందన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement