Wednesday, March 27, 2024

ఏప్రిల్28న ఏజెంట్.. అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్

హీరో అఖిల్ న‌టిస్తోన్న తాజా చిత్రం ఏజెంట్.. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డింది.ఎట్టకేల‌కు ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసి పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర టీం.ఈ మూవీని ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ చేసిన పోస్టర్‌లో హీరో అఖిల్‌ మొహం నిండా రక్తంతో కోపంతో రగిలిపోతున్నట్లు ఉన్నారు. ఈ ఒక్క పోస్టర్‌ సినిమా క్రేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇన్నాళ్లు ప్రేమ కథలతో దగ్గరైన అఖిల్‌.. మాస్‌ యాక్షన్‌ సినిమా చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో పోస్టర్‌తో మేకర్స్ ఓ డెమో ఇచ్చారు.సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో అఖిల్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్రలో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement