Friday, April 19, 2024

Big Breaking | మళ్లీ కుండపోత.. ఇవ్వాల మ్యాచ్​ కష్టమే!

అహ్మదాబాద్​లో భారీ వర్షం కారణంగా ఇవ్వాల (ఆదివారం) రాత్రి జరగాల్సిన మ్యాచ్​ కు అంతరాయం కలిగింది. అయితే.. 9గంటల తర్వాత కాస్త వాన తగ్గడంతో అంపైర్లు, జట్టు ముఖ్యులు హార్దిక్​ పాండ్యా, వేడ్​, నేహ్రాతో కలిసి పిచ్​తోపాటు అవుట్​ ఫీల్డ్​ని పరిశీలించారు. పిచ్​పై కవర్లను తొలగించేందుకు అంతా రెడీ అయ్యారు.

ఇక టాస్​ వేయొచ్చు అనుకునే సమయంలో మరోసారి 9.20 నిమిషాలకు వర్షం కుండపోతగా గుమ్మరించింది. దీంతో ఇవ్వాల మ్యాచ్​ ఆడడం కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. హుటా హుటిన తొలగించిన కవర్లను మళ్లీ పిచ్​పై కప్పేశారు.  ఇక స్టేడియానికి తరలివచ్చిన వారు వర్షంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వాన చినుకుల నుంచి కాపాడుకునేందుకు షెల్టర్​ కోసం పరుగులు తీయడం కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement