Friday, April 19, 2024

14ఏళ్ల త‌ర్వాత విజ‌య్ తో త్రిష‌

14ఏళ్ల త‌ర్వాత త‌మిళ స్టార్ విజ‌య్ తో న‌టిస్తోంది హీరోయిన్ త్రిష‌. రీసెంట్ గా విజయ్ త‌న 67వ చిత్రాన్ని ప్ర‌క‌టించాడు. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనగరాజ్ . సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌, రత్నకుమార్‌, ధీరజ్‌ వైడీ డైలాగ్స్‌ అందిస్తున్నారు. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు. దళపతి 67 మూవీ షూటింగ్‌ జనవరి 2న గ్రాండ్‌గా మొదలైంది’ అంటూ ఇప్పటికే సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో అప్‌డేట్ అందించింది. అంతేకాదు ఇందులో కేజీఎఫ్‌ 2 విలన్‌, బాలీవుడ్‌ స్టార్ హీరో సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్టు కూడా అప్‌డేట్ అందించింది.మరోవైపు కొరియోగ్రఫర్‌ సాండీ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ట్వీట్ చేసింది సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో. ఇపుడు ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో విజయ్‌తో .. హీరోయిన్ త్రిష రొమాన్స్ చేయబోతుంది. ఈ మేర‌కు ఓ ప్రోమో కూడా షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement