Thursday, April 25, 2024

సినీ గేయ రచయిత అదృష్ట దీపక్ కన్నుమూత

ప్రముఖ కవి, సీనీగేయ రచయిత అదృష్టదీపక్ కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. తూర్పుగోదావరి జిల్లా, రాయవరం మండలం సోమేశ్వరం ఆయన స్వగ్రామం. అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసిన అదృష్టదీపక్ రామచంద్రాపురంలో విశ్రాంత జీవితం గడుపుతూ కరోనా బారినపడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1950, జనవరి 18న ఆయన జన్మించారు. దీపక్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సినీ గేయ రచయితగా, నటుడిగా అదృష్ట దీపక్ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ‘నేటి భారతం’ చిత్రంలో ఆయన రచించిన ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ గీతానికి ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు పొందారు. ఆయన రచనలకు గాను ఎన్నో పురస్కారాలు లభించాయి. అదృష్ట దీపక్‌ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement