Thursday, March 28, 2024

అమెజాన్ ప్రైమ్‌లో అడివి శేష్ హిట్ 2.. ఎప్ప‌టి నుంచి స్ట్రీమింగ్‌కు అంటే..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ ది సెకండ్ కేస్‌. ఈ సినిమాతో తన విజయ పరంపరను కొనసాగిస్తూ డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు శేష్. కాగా, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సూపర్ హిట్ మూవీ డిజిటల్ ప్రీమియర్ కి రెడీగా ఉంది. లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం.. హిట్ 2 ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఈ శుక్రవారం (జనవరి 6) నుండి ప్రతి ప్రైమ్ యూజర్‌కి సినిమా అందుబాటులో ఉంటుంది. అయితే ఈ మూవీ పేయిడ్ కాటగిరీ లో పెట్టారు మేకర్స్.. ఎవరైనా సరే ఈ మూవీ చూడటానికి రూ.129 రెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌదరి మహిళా లీడ్ రోల్‌లో ఉంది. ఇందులో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సుహాస్, తనికెళ్ల భరణి, పోసాని క్రిషన్ మురళి కూడా ఉన్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement