Friday, April 19, 2024

ఆదిపురుష్ నుండి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

ఆదిపురుష్ మూవీ నుండి స్టార్ హీరో ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ ని ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ఓం రౌత్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్న ప్రభాస్.. ఆకాశానికి విల్లును ఎక్కు పెట్టిన పోస్ట్ అద్భుతంగా ఉంది. పొడవాటి జుట్టు, భుజాలకు రుద్రాక్షలు ధరించిన ప్రభాస్ చాలా గంభీరంగా, పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఓం రౌత్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ ఫస్ట్ లుక్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సీతాదేవిగా కృతి సనన్ నటించింది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన పది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.ఈ చిత్రం టీజర్ ను ఆదివారం విడుదల చేస్తున్నట్టు దర్శకుడు ఓం రౌత్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, అయోధ్యలోని సరయూ నది ఒడ్డున టీజర్ లాంచ్ చేస్తామని ప్రకటించారు. ఆదివారం రాత్రి 7.11 గంటలకు టీజర్ విడుదల అవుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చారు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement