Friday, April 19, 2024

అద్భుతం చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..ఏమ‌న్నారంటే..

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ఈ నెల 19నుంచి స్ట్రీమింగ్ అవుతోంది అద్భుతం మూవీ. ఈ చిత్రంలో తేజ స‌జ్జా..శివాని రాజ‌శేఖర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ని పోషించారు. “హాట్ స్టార్ లో ‘అద్భుతం’ సినిమాను చూశాను. ఇది ఒక న్యూ ఏజ్ ఎంగేజింగ్ నోవెల్ సినిమా అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తేజ సజ్జ .. శివాని ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు. వారి నటన చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సినిమా టీమ్ లోని అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంద‌ని తెలిపారు. ఇంతటి ప్రోత్సాహకరమైన ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తేజ సజ్జ స్పందించాడు. ఆయన పట్ల తనకి గల ప్రేమాభిమానాలను వ్యక్తం చేశాడు. విభిన్నమైన కథాకథనాలతో వచ్చిన ఈ సినిమా, యూత్ కి బాగానే కనెక్ట్ అయింది. అయితే ఈ లైన్ .. ఈ స్క్రీన్ ప్లే సాధారణ ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement