Thursday, March 28, 2024

బేబి బంప్ తో.. న‌టి ఇషితా ద‌త్తా

న‌టి ఇషితా ద‌త్తా బేబి బంప్ తో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇషితా దత్తా బేబి బంప్ ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లుకొడుతున్నాయి.ఇషితా దత్తా.. 2012 లో వచ్చిన చాణక్యుడు సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కాని ఇక్కడ పెద్దగా సినిమాలు చేయలేదు. బాలీవుడ్ దృశ్యం సినిమాలో అజయ్ దేవ్‌గణ్ కూతురుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..

మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ దృశ్యం తమిళం, తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో డబ్ అవగా.. హిందీలో ఇషితా తన నటనతో మెప్పించింది.. అలాగే 2022 లో వచ్చిన సీక్వెల్ దృశ్యం 2 లో కూడా నటించి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది..త్వరలో ఇషితా తల్లికాబోతోందని తెలుస్తోంది. ఈ విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా..ఇషితా బేబి బంప్‌తో వీడియో తో పాటు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమధ్య ఇషితా ముంబయి ఎయిర్ పోర్ట్‌లో కెమెరాల కంట పడింది.. ఆ సమయంలో ఆమె బేబీ బంప్ తో ఉంది. దాంతో ఆమె ప్రెగ్నెంట్‌ అని రివిల్ అయ్యింది. ఇక 2017 లో ఇషితా… వత్సల్ సేథ్‌ను పెళ్ళి చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement