Wednesday, November 6, 2024

Sayaji Shinde | రాజకీయాల్లోకి సినీ విలన్..

నటుడు సాయాజీ షిండే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయ‌న‌ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన అజిత్‌ పవార్‌ ఎన్సీపీ పార్టీలో చేరారు. అజిత్ పవార్ స్వయంగా సాయాజీ షిండేను పార్టీలోకి స్వాగతించారు.

ఎన్సీపీలో చేరిన తర్వాత సాయాజీ షిండే మాట్లాడుతూ.. తాను చాలా కాలంగా సేవలందిస్తున్నానని, తన సేవను కొనసాగిస్తానని చెప్పారు. అజిత్ పవార్‌ను ప్రశంసిస్తూ, తమ పార్టీ విధానాలు ఆకర్షణీయంగా ఉన్నాయని, అందుకే తాను ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement